31 May, 2026 | 1:35 AM

పార్టీ పటిష్ఠతకు సభ్యత్వ నమోదే పునాది

31-05-2026 12:07 AM

ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి

కుషాయిగూడ, మే 30 (విజయక్రాంతి) : డాక్టర్ ఏఎస్రావునగర్ డివిజన్లో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ రౌండ్ బిల్డింగ్లో నిర్వహించిన ఎస్‌ఐఆర్, పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను మరింత విస్తరించేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నా రు. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడంలో కార్యకర్తల పాత్ర ఎంతో ముఖ్యమని, ప్రతి ఇంటికీ పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని ఆయన కోరారు. కార్యక్ర మంలో మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, కాసం మైపాల్ రెడ్డి, పెద్దాపురం కుమారస్వామి, బేతాళ బాలరాజు, షేర్ మణమ్మ, మురళి పంతులు, శిరీష, సిం గారపు మనమ్మ, సత్తమ్మ, గొల్ల పద్మ, రమేష్ చారి, ఎస్కే రహీం, మాట్ల గిరి, ఓట్ల మొగిలయ్య, కే. కృష్ణ, ఎంపీ దాసు, సాయి రెడ్డి, రత్నాల కనకయ్య, ఎన్. రమేష్, నాగపురి రాజు, మల్లేష్, గోవర్ధన్ చారి, ఆనంద్ చారి, ఈ. భాస్కర్, సింగారపు రాజు, శివదేవచారి, ఓట్ల యాదగిరి, పంతులు నరసింహ, పాషా, మన్సూర్, సాంబశివరెడ్డి, సత్యనారాయణ గౌడ్, సత్యనారాయణ, మల్లికార్జున, బాల య్య, సరిత, మాలతి తదితర బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.