calender_icon.png 5 February, 2026 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి

05-02-2026 12:57:47 AM

13వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎరుకలి రవి 

జిన్నారం /అమీన్ పూర్ ఫిబ్రవరి 4: జిన్నారం మండలం గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎరుకలి రవి బుధవారం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ నెల 11 జరిగే మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. వార్డు ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చి తమను గెలిపించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని వార్డ్ అభివృద్ధికి నిధులు తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు రాజుగౌడ్, నల్తూరి శ్రీనివాస్, మియాపురం నరసింహులు, శేఖర్, లింగం, డప్పు రవి తదితరులు పాల్గొన్నారు.