వెస్ట్ జోన్ డీసీపీకి అభినందనలు తెలిపిన వరంగల్ సీపీ
25-08-2026 11:26 PM
జనగామ,(విజయక్రాంతి): ఐపీఎస్ హోదా పొందిన వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రాజమహేంద్ర నాయక్ కు మొక్కను అందజేసి అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో మరింత అంకితభావంతో పనిచేసి శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. రాజమహేంద్ర నాయక్ సేవలను సీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.






