26 August, 2026 | 2:01 AM

జీఓ నెం.97 ను వెంటనే ప్రభుత్వం రద్దు చేసేలా చూడాలని హరీష్ రావుకు వినతి

26-08-2026 12:19 AM

సూర్యాపేట,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకులు, సాంకేతిక విద్యకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, జీఓ నెం.97 ను రద్దు అయ్యేలా చూడాలని కోరుతూ మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే హరీష్ రావు జిల్లా బీసీ జేఏసీ కన్వీనర్ భద్రబోయిన సైదులు మంగళవారం వినతిపత్రం అందజేశారు.

అనంతరం సైదులు మాట్లాడుతూ... స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులు ఈ సెట్ ద్వారా బీటెక్ లాటరల్ ఎంట్రీ పొందే విద్యార్థులు, పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉందనీ వివరించారు. సాంకేతిక విద్యలో ఇప్పటికే ఉన్న విధానాలు, పరీక్షా వ్యవస్థ, సర్టిఫికెట్లు, పాలిటెక్నిక్ విద్యార్థుల ఉన్నత విద్యావకాశాలు దెబ్బతినకుండా  ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని హరీష్ రావును కోరినట్లు తెలిపారు.