కుభీర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు
కుభీర్,(విజయక్రాంతి): కుభీర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఫ్రెషర్స్ డే (నూతన విద్యార్థుల స్వాగతోత్సవం) వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. కళాశాల సీనియర్ విద్యార్థులు నూతనంగా చేరిన జూనియర్ విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ వేడుకల్లో కళాశాల ప్రిన్సిపాల్ సునీల్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విజయ్ భాస్కర్, హన్మంత్ రావ్, సంపత్, శేఖర్, శివరాజ్, శ్రీనివాస్, నర్సయ్య, నరేష్, ఉమాదేవి, రమ్య, సందీప్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. కళాశాల ప్రాంగణమంతా విద్యార్థుల కోలాహలంతో ఎంతో ఉత్సాహభరితంగా మారింది.






