ఓటరు సమగ్ర డిజిటల్ సర్వేకు సహకరించాలి
- బెల్లంపల్లి ఎమ్మార్వో కృష్ణ
బెల్లంపల్లి,(విజయక్రాంతి): జనాభా లెక్కల 2027 భాగంగా చేపట్టిన జన గణన సమర్థవంతంగా సాగుతుందని బెల్లంపల్లి తహసిల్దార్ లవ్డియ కృష్ణ, ఎంపీడీవో మహేందర్ అన్నారు. తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. జనగణన బెల్లంపల్లి మండలంలో 58 బ్లాక్ లను విభజించి 46 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. ఈ ప్రక్రియలో ఓటర్లకు స్వీయ గణన సదుపాయం ఏర్పాటు చేశామన్నారు. రెండు విడతలుగా జన గణన సాగుతుందనీ చెప్పారు.
మొదట విడత కుటుంబ గణన ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో జన గణన ఉంటుందన్నారు. స్వీయగణన పూర్తయిన తర్వాత 12 అంకెల ఐడిని ఓటర్లు భద్రపరుచుకోవాలని తెలిపారు. ఆస్తుల వివరాలు చెప్పడం వల్ల ఎలాంటి నష్టం ఉండదన్నారు. సమాచార గోప్యత పాటిస్తామన్నారు. వ్యక్తిగత ఆస్తులు సమగ్రంగా వెల్లడించడంలో ఓటర్లు ఇలాంటి అపోహలకు లోనుకావద్దన్నారు. జనాభా లెక్కలతో సంక్షేమ అభివృద్ధి పథకాలకు ముడిపెట్టి చూడవద్దన్నారు. జనగణనను పూర్తిస్థాయిలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పునరుద్ఘాటించారు.
- ఎస్ఐఆర్ కు సహకరించాలి..
ప్రత్యేక సమగ్రన సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్) ప్రజలు సహకరించాలని తాసిల్దార్ కృష్ణ అన్నారు. ఈ సర్వే ఇప్పటికే దేశంలోని 12 రాష్ట్రాల్లో కొనసాగుతుందని తెలిపారు. బెల్లంపల్లి మండలం, మున్సిపాలిటీ లో 66% సర్వే పూర్తయిందని తెలిపారు. బిఎల్వోలు ఓటర్ నమోదులో నిమగ్నమై ఉన్నారన్నారు. బిఎల్వోలకు పూర్తి సమాచారం అందజేసి ఎస్ఐఆర్ ను విజయవంతం చేయాలని కోరారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు బిఎల్ఏల అందచేయాలని కోరారు. ఓటర్లు తప్పకుండా వెబ్సైట్లో మ్యాప్ చేసుకోవాలని తెలిపారు. ఈ సవర్ణలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లు తమ తల్లిదండ్రుల ను ఆధారం చేసుకుని నమోదు చేసుకోవాలని వెల్లడించారు. ఈ సమావేశంలో ఏఎస్ఓ రమేష్ పాల్గొన్నారు.






