30 June, 2026 | 1:45 AM

ఓటర్ల వివరాలు యాప్‌లో స్పష్టంగా నమోదు చేయాలి

30-06-2026 12:44 AM

కలెక్టర్ కుమార్ దీపక్

మందమర్రి, జూన్ 29 : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఎన్యుమరేషన్ ఫారాలు అందించి ఓటర్ల నుంచి సేకరించిన సమాచారం బి.ఎల్.ఓ. యాప్ లో స్పష్టంగా నమోదు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. సోమవారం మందమర్రి మండలం క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని 21, 15 వార్డులలో కొనసాగుతున్న ఎన్యుమరేషన్ ఫారాల ప్రక్రియను మండల తహసిల్దార్ సతీష్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లకు అందిస్తున్న ఎన్యుమరేషన్ ఫారాల ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని, ఓటర్ల నుంచి సేకరించిన వివరాలను బీఎల్‌ఓ యాప్ లో స్పష్టంగా నమోదు చేయాలన్నారు.

జూలై 24 వరకు నిర్వహించే సమగ్ర సవరణ ఇంటింటి కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని, ఈ క్రమంలో బూత్ స్థాయి అధికారులు ఓటర్ల వద్దకు వెళ్లిన సమయంలో ఎన్యుమరేషన్ ఫారం అందించినప్పుడు బి ఎల్ ఓ యాప్ లో మార్క్ చేయాలని తెలిపారు.

సదరు ఓటరు ఎన్యుమరేషన్ ఫారం నింపిన తరువాత తిరిగి సేకరించి యాప్ లో వివరాలు నమోదు చేయాలని తెలిపారు. మరణించిన వారు, గ్రామం వదిలి వెళ్ళిన వారు, రెండు, అంతకు మించి ఎపిక్ కార్డులు కలిగి ఉండడం అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఒకరికి ఒక ఓటరు గుర్తింపు కార్డు మాత్రమే ఉండేలా స్పష్టమైన జాబితా రూపొందించాలన్నారు. ఎన్యుమరేషన్ ఫారాలు నింపిన తరువాత తిరిగి సేకరించి బి ఎల్ ఓ యాప్ లో ఎలాంటి పొరపాట్లు లేకుండా వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని, ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.