ఎడ్లకు ప్రత్యేక పూజలు
నాగల్గిద్ద, జూన్ 29: నాగల్గిద్ద మండలంలోని శేరి దామరగిద్ద గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులు సంప్రదాయబద్ధంగా ఎడ్లను అలంకరించి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. వ్యవసాయానికి వెన్నెముకైన ఎడ్లకు పూజలు చేసి, ఈ ఏడాది పంటలు సమృద్ధిగా పండాలని రైతులు ప్రార్థించారు.గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా రైతులు, గ్రామ పెద్దలు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
రంగురం గుల అలంకరణలతో ఎడ్లను సిద్ధం చేసి గ్రా మంలో సందడి నెలకొల్పారు. సంప్రదాయాలను కాపాడుతూ ఏరువాక పౌర్ణమి వే డుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ మల్గే రాజు, ఉపసర్పం చ్ పండరీనాథ్ పాల్గొని రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రైతులు సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆ కాంక్షిస్తూ వేడుకల్లో పాల్గొన్నారు.






