30 June, 2026 | 2:31 AM

ఈఎంఆర్‌ఎస్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

30-06-2026 12:44 AM

బోధన నుంచి భోజనం వరకు పరిశీలన 

ఎల్లారెడ్డిపేట, జూన్ 29 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండ లం దుమాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్‌ఎస్)ను సోమ వారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదిలో విద్యార్థులతో కలిసి కూర్చుని ఎకనామిక్స్ బోధనను పరిశీలించిన కలెక్టర్, అనంతరం విద్యా ర్థులకు ప్రశ్నలు అడిగి వారి అభ్యాస స్థాయిని తెలుసుకున్నారు. డైనింగ్ హాల్‌ను  సందర్శించి మధ్యాహ్న భోజన నాణ్యత, మెనూను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

ప్రతిరోజూ మెనూ ప్రకారం భోజ నం అందుతున్నదా, వసతి సంబంధిత ఇ బ్బందులు ఏమైనా ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రభుత్వ వసతులను సద్వినియోగం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా చదివి లక్ష్యాలను సాధించాలని సూచించారు. లైబ్రరీలోని పు స్తకాలతో పాటు దినపత్రికలు కూడా చదవడం ద్వారా సమకాలీన అంశాలపై అవగా హన పెంచుకోవాలని తెలిపారు. ఈ తనిఖీలో ప్రిన్సిపాల్ ఫాతిమా, ఎంపీడీఓ సత్త య్య తదితరులు పాల్గొన్నారు.