30 June, 2026 | 1:44 AM

వైద్యులు అందుబాటులో ఉండాలి

30-06-2026 12:43 AM

డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్

మందమర్రి/కాసిపేట, జూన్ 29 : పీహెచ్సీలలో, ఉప కేంద్రాలలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆదేశించారు. గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందిస్తున్న వైద్య సేవలపైన ఆకస్మిక తనిఖీలో భాగంగా సోమ వారం మందమర్రి పీహెచ్సీని, కాసిపేట మండలంలోని మామిడిగూడ ఉపకేంద్రాన్ని పరిశీలించారు. పల్స్ పోలియో కార్యక్రమం తీరును గ్రామంలో తిరిగి ప్రత్యక్షంగా గమనిం చారు.

ఈ సందర్భంగా డీఎం అండ్ హెచ్‌ఓ మాట్లాడుతూ అసంక్రమణ వ్యాధులు 30 సంవత్సరముల పైబడిన వారందరికీ పరీక్షలు చేయడం, ఆన్ లైన్ పోర్టల్ లో నమోదు చేయడం, సరైన సమయంలో మందులు అందజేయడం, డయాబెటిస్, బీపీ క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల వివరాలను పరిశీలించి పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లాలో 14 ఏండ్లు నిండిన బాలికలకందరికీ గర్భాశయ ముఖ క్యాన్సర్ కు నివారణ కోసం ఇచ్చు హెచ్పీవీ వ్యాక్సినేషన్ అందేలా చూడాలన్నారు. డీఎం అండ్ హెచ్‌ఓ వెంట ప్రోగ్రామ్ ఆఫీసర్, ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు న్నారు.