30 June, 2026 | 2:13 AM

ఏడుపాయల్లో కాటేజీల నిర్మాణానికి రూ.7 కోట్లు మంజూరు

30-06-2026 01:42 AM

ఉత్తర్వులు జారీ చేసిన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్

పాపన్నపేట,జూన్29: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం సన్నిధిలో 12 కాటేజీల నిర్మాణానికి రూ.7 కోట్లు మంజూరు చేస్తూ తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్ జీవో ఆర్టి నెంబర్ 193 తేదీ 29.06.2026 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ అవసరాలు ఎకో ఫ్రెండ్లీ ద్వారా 12 కాటేజీలను ఏడుపాయల్లో నిర్మించడానికి నిధులను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా టూరిజం శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ను ఆదేశించారు.