29 May, 2026 | 8:02 PM

ప్రభుత్వ విప్‌ను కలిసిన వీవోఏలు

29-05-2026 04:55 PM

సమస్యలను పరిష్కారం కోసం వినతి పత్రం అందజేత

 సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ విప్

సిరిసిల్ల, మే 29,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐకేపీ (IKP) వ్యవస్థలో పనిచేస్తున్న Village Organization Assistants (VOAs) చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా, వేములవాడ నియోజకవర్గ శాసనసభ సభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను వివో ఏ ల ప్రధాన సమస్యలు, డిమాండ్లపై సమగ్ర మెమోరాండం అందజేశారు, ఈ సందర్భంగా వివో ఏలు  ఎదుర్కొంటున్న ఉద్యోగ భద్రత, CBO HR పాలసీ అమలు, గౌరవప్రదమైన వేతనం, సంక్షేమ పథకాల కల్పన, సేవా నియమాల రూపకల్పన తదితర అంశాలను ఎమ్మెల్యే  దృష్టికి తీసుకెళ్లాగా ప్రభుత్వ విప్, వివోఏల సమస్యలపైన సానుకూలంగా స్పందించి పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.

విఓఏల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కొనసాగుతున్న ఈ ఉద్యమానికి ప్రజాప్రతినిధుల మద్దతు లభించడం సానుకూల పరిణామంగా భావిస్తున్నారు, తమ పట్ల ప్రభుత్వపరంగా సానుకూల నిర్ణయం వచ్చే విధంగా కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట,  ముస్తాబాద్, సిరిసిల్ల, చందుర్తి  కోనరావుపేట, గంభీరావుపేట మండల వివో ఏ  సంఘాల అధ్యక్షులు కొప్పుల రమ, సుధారాణి, పద్మ, జోష్ణ,ఆడపు శోభ.  మంజుల అలాగే సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామ్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, డైరెక్టర్ మెండే శ్రీనివాస్, అనవేని రవి తదితరులున్నారు.