పదవీ విరమణ పొందనున్న జీఎం బత్తుల శ్రీనివాసరావుకి ఘన సన్మానం
పదవీ విరమణ పొందనున్న జీఎం ( సిఎంసీ ) బత్తుల శ్రీనివాసరావు కి ఘన సన్మానం ...
కొత్తగూడెం మే 29 విజయక్రాంతి: మే 31వ తేదీన పదవీ విరమణ పొందనున్న జీఎం (సీఎంసీ) శ్రీ బత్తుల శ్రీనివాసరావు కు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం షాలెమ్ రాజు కార్యలయం లో ,సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ షాలెమ్ రాజు మాట్లాడుతూ, బత్తుల శ్రీనివాసరావు , సింగరేణి సంస్థలో 33 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూ, సంస్థ అభివృద్ధికి విశేష సేవలు అందించారని కొనియాడారు. తన విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావంతో సహచరులకు ఆదర్శంగా నిలిచారని , సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, సంస్థకు అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని తెలిపారు.
అనంతరం బత్తుల శ్రీనివాసరావు మాట్లాడుతూ, పీవీకే–5 ఇంక్లైన్‌లో పనిచేసిన రోజులను స్మరించుకున్నారు. సింగరేణి వంటి ప్రతిష్టాత్మక సంస్థలో సేవలందించడం తనకు గౌరవప్రదమైన అనుభవమని పేర్కొన్నారు. తన సేవా కాలంలో సహకరించిన ఉన్నతాధికారులు, సహచరులు, కార్మికులు, ఉద్యోగులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం అధికారులు ఆయనను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. పదవీ విరమణ అనంతరం , ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కొనసాగాలని అందరూ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఓ.టు జీఎం కోటిరెడ్డి , ఏజీఎం (ఫైనాన్స్) బీబత్స , వీకేసీఎం (సిఎంఓఏఐ) ప్రెసిడెంట్ కొత్తగూడెం ఏరియా /ప్రాజెక్టు ఆఫీసర్ నరసింహరావు , ఏజీఎం (సివిల్) రామకృష్ణ , పర్సనల్ మేనేజర్ ఎల్. తిరుపతి , ఎస్‌ఈ (ఈ&ఎం) అజ్మీర శ్రీనివాస్ , ఎస్‌ఈ నాగభూషణం , (సిఎంఓఏఐ) జనరల్ సెక్రటరీ ఉపేందర్ , ఏరియా సెక్యూరిటి అధికారి అభిలాష్ , సీనియర్ పీవో ఎం.మురళీ , ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.






