23 May, 2026 | 5:11 AM

తమ సమస్యలు పరిష్కరించాలని వీఓఏలు ధర్నా

23-05-2026 02:01 AM

సత్తుపల్లి, మే 22 (విజయ క్రాంతి):   తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని వీఏఓ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయ ఎదుట  సత్తుపల్లి మండల విఓఏల సంఘం  అద్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఆ సంఘం  అధ్యక్షురాలు తుమ్మలపల్లి సరోజిని మాట్లాడుతూ నెలకు కేవలం రూ.150 గౌరవ వేతనం నుండి సేవలందిస్తున్నామని, ఇప్పటికీ  రూ.5000 వరకు మాత్రమే వేతనం అందుతున్న పరిస్థితుల్లో కుటుంబాలను పోషించడం కష్టమవుతుందని వాపోతున్నారు.

ప్రభుత్వ పథకాల అమలులో మేము కీలక పాత్ర పోషిస్తున్నామని, గ్రామాల్లో మహిళా సంఘాల నిర్వహణ నుంచి పేదల సంక్షేమ కార్యక్రమాల వరకు బాధ్యతలు నిర్వర్తిస్తున్నా, మాకు కనీస వేతనం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలను కనీసం నెలకు రూ.20 వేలుగా నిర్ణయించి, నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా హెచ్‌ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సాదు చిట్టెమ్మ, నారపోగు సుధాకర్, సుజాత, అభిబున్నీస్సా , భాగ్యలక్ష్మి, రాజేశ్వరి, ధనలక్ష్మి, పద్మ, లత తదితరులు పాల్గొన్నారు.