23 May, 2026 | 8:39 PM

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

23-05-2026 08:09 PM

ముకరంపుర,(విజయక్రాంతి): విద్యార్థులు పదవ తరగతిలో సాధించిన విజయంతో ఆగిపోకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హైదరాబాద్ ఈగల్ ఎస్పీ ఆర్ గిరిధర్ అన్నారు. కరీంనగర్ లోని వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గంప వజ్రమ్మ విద్యాపురస్కారం, వై రఘునాథం ఎక్స్లేన్సీ అవార్డులను ఎస్పీ గిరిధర్, ఐఆర్ఎస్ ఎస్ మురళి మోహన్ లు హాజరై ప్రదానం చేశారు. వెంకట్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న అనాధ శరణాలయం బాల గోకులం విద్యార్థులకు ఆన్ లైన్లోకంప్యూటర్ కోడింగ్, ఆంగ్ల భాషలో ప్రావీణ్యత పైక్లాసులు తీసుకున్న హైకోర్టున్యాయమూర్తి ఇ వి వేణుగోపాల్ సంతానమైన ఇ వి రిషిత, ఇ వి ఆర్యన్ సాయి లకు ప్రత్యేక సర్టిఫికేట్ ప్రదానం చేశారు. 185 విద్యార్థులకు గోల్డ్మెడల్స్, ప్రధాన ఆచార్యులకు పురస్కారం అందజేశారు. కార్యక్రమంలో సి వి రావు, వి పూజ, ఫౌండేషన్ చైర్మన్ గంప వెంకట్, సభ్యులు డా జయరాములు, రవి నటరాజ్, డా సతీష్ కుమార్, కె శంకర్, వీరేశం, రవికాంత్, ప్రతాప్, వాలంటీర్లు పాల్గొన్నారు.