13 May, 2026 | 10:09 AM

విశ్వహిందూ పరిషత్ నాయకులు బీడీల రాములు ఇక లేరు

13-05-2026 09:39 AM

సంతాపం తెలిపిన ప్రముఖులు. 

తాండూరు, మే 13,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ విశ్వహిందూ పరిషత్ సీనియర్ నాయకులు, సుప్రసిద్ధ మిఠాయి తయారీదారులు బీడీల రాములు(80) గత రాత్రి స్వర్గస్తులయ్యారు. గత కొన్ని రోజుల క్రితం ఇంట్లో జారిపడి ఎముకలకు గాయాలు కావడంతో చికిత్స పొందుతూ పరిస్థితి విషయం నుంచి అస్వస్థతకు గురై మృతి చెందారు. ప్రతి ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా ప్రత్యేకంగా గేవర్ మిఠాయిలు తయారు చేయడం తో జిల్లాస్థాయిలో సుప్రసిద్ధ పేరు గడించారు.

అంతేగాక హిందూ ధార్మిక, ఆధ్యాత్మిక  కార్యక్రమాల్లో ముందుండి చురుకుగా పాల్గొనే ఆయన  మృతి పట్ల విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, కార్యకర్తలు ప్రముఖులు వివిధ పార్టీలకు చెందిన నాయకులతో పాటు  బివిజి ఫౌండేషన్ వ్యవస్థాపకులు,  ప్రముఖ వైద్యులు సంపత్ కుమార్, కోర్వార్ నగేష్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. (బుధవారం) నేడు మధ్యాహ్నం మూడు గంటలకు బీసీ స్మశానవాటిక లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.