23 August, 2026 | 2:35 AM

50 గజాల్లో ఏడంతస్థులు పేకమేడలా కూలిన భవనం

23-08-2026 01:40 AM

ఇద్దరు కార్మికులు దుర్మరణం

  1. మాదాపూర్‌లోని అంజయ్యనగర్‌లో ఘటన 
  2. మృతులు మధ్యప్రదేశ్‌కు చెందినవారు
  3. పక్క భవనాలపై పడిన శిథిలాలు.. గోడలు, గదులు ధ్వంసం
  4. అక్రమ భవనాలన్నింటినీ కూల్చేస్తాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరికలు

హైదరాబాద్/శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (విజయక్రాంతి): మాదాపూర్‌లోని అంజయ్యనగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నాలాను ఆనుకుని కేవలం 30 నుంచి 50 గజాల విస్తీర్ణంలో అక్రమంగా నిర్మిస్తున్న ఏడంతస్థుల భవనం శనివా రం మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది. భవనం శిథిలాల కింద చిక్కుకుని టైల్స్ పనులు చేస్తున్న ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. మృతులంతా మధ్యప్రదే శ్‌కు చెందిన ఉమేశ్ కారే(34), మోపత్/(మహబత్) (42)గ గుర్తించారు.

ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. అలాగే భవన శిథిలాలు పక్క భవనాలపై పడ్డాయి. ఆ అపార్ట్‌మెంట్ గోడలు, గదులు ధ్వంసమయ్యాయి. 10 ప్లాట్లతో పాటు మరొక భవనం పాక్షికంగా దెబ్బతింది. అపార్ట్‌మెంట్ 4వ అంతస్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో భారీ శబ్దం రావడంతో పరిసర ప్రాంతాల ప్రజలు, సమీపంలోని హాస్టళ్లలో ఉంటున్న వారు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. ‘పెద్ద శబ్దం రాగానే కిందకు పరుగులు తీశాం.

అప్పటికే భవనం కూలిపోయింది. తిరిగొచ్చేసరికి మా బెడ్రూ మ్ ధ్వంసమైంది. అదృష్టం బాగుండి ప్రా ణాలతో బయటపడ్డాం’ అని బాధితుడు ఉమామహేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న వెంటనే మాదాపూర్ పోలీసులు, హైడ్రా, డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.

హెవీ మిషనరీ సహాయంతో శిథిలాలను తొలగించి, ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. లోపల మరెవరైనా చిక్కుకు న్నారా అనే కోణంలో గాలిం పు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే సంఘటనా స్థలాన్ని సీఎం సీ కమిషనర్ గుమ్మల శ్రీజన, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జోనల్ కమిషనర్ మయాం క్ సింగ్, డీసీపీ రితిరాజ్, పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు.

కఠిన చర్యలు: సీఎంసీ కమిషనర్ శ్రీజన

నాలాను కబ్జా చేసి, నిపుణుల సలహాలు లేకుండా హాస్టల్ నిర్వహణ కోసం ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు విచారణలో తేలింది. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సైబ రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) కమిషనర్ శ్రీజన స్పష్టం చేశారు. ఇంత చిన్న స్థలంలో, నాలా పక్కన ఏడంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు ఎలా వచ్చాయి? నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలు పాటించారా? ఈ నిర్మాణం వెనుక ఉన్న యజమానులు ఎవరు? అనే కోణంలో అధికారులు సమగ్ర విచారణ ప్రారంభించారు.

అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన..

 శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం కుప్పకూలి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటనపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందిస్తూ అక్రమ నిర్మాణదారులపై తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనలో తీవ్ర నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని తెలిపారు.

ఈ ప్రమాదం కేవలం మానవ తప్పి దాల వల్లనే కాకుండా చట్టబద్ధ నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టడం వల్లనే జరిగిం దని ప్రాథమిక విచారణలో తేలింది. తెలంగాణ మున్సిపల్ చట్టం, నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం 50 గజాల స్థలంలో కేవలం జీ+2 అంతస్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ ఇక్కడ ఏకంగా 7 అంతస్తులు నిర్మించారు. 20 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉండే భవనాలకు చుట్టూ కనీసం 3 నుంచి 6 మీటర్ల ఖాళీ స్థలం వదలాలి.

ఈ నిర్మాణంలో అసలు ఎలాంటి ఖాళీ స్థలం వదల్లేదు. అందులోనూ నాలా బఫర్ జోన్ ను ఆక్రమించారు. నాలా పక్కన నిబంధనల ప్రకారం ఉంచాల్సిన 2 నుంచి 9 మీటర్ల బఫర్ జోన్‌ను కబ్జా చేసి ఈ భవనాన్ని కట్టారు. టీజీ-బీపాస్  ద్వారా ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. మట్టి పరీక్షలు, స్ట్రక్చరల్ ఇంజినీర్ సర్టిఫికెట్ లేకుండానే నాసిర కం మెటీరియల్‌తో నిర్మించారు. కార్మికులకు ఎలాంటి సేఫ్టీ గేర్ అందించకపోగా, పక్కన ఉన్న భవనాల రక్షణకు సంబంధించి ఎలాం టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు.

అక్రమ భవనాలను కూల్చేస్తాం: హైడ్రా 

 ప్రమాదం జరిగిన పరిసర ప్రాంతాల్లో 40--50 గజాల స్థలాల్లో నిబంధనలకు వి రుద్ధంగా నిర్మించిన ఐదారస్థుల భవనాల్లో అధిక భాగం కమర్షియల్ హాస్టళ్లుగా నడుస్తున్నట్లు గుర్తించారు. ప్రమాదకర పరిస్థితు ల్లో ఉన్న భవనాల నుంచి నివాసితులు, విద్యార్థులను తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా హైడ్రా అధికారులు హెచ్చరించారు.

నిర్మాణ దారులు, బిల్డర్లు, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు/సహకారం అందిం చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయ నున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. చెరువులు, నాలాల బఫర్ జోన్లు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టిన అక్రమ భవనాలన్నింటినీ విచక్షణ లేకుండా కూల్చివేస్తామని ఆయన తేల్చిచెప్పారు.