మహిళా సంఘాలను ప్రోత్సహిస్తాం: భట్టి విక్రమార్క
హైదరాబాద్: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళా సాధికారతే లక్ష్యంగా మే 25 నుంచి 31 వరకు మహిళా వారోత్సవాలను రాష్ట్రం ప్రభుత్వం ప్రారంభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 8 వేల ఇందిరా మహిళా శక్తి భవనాలకు శ్రీకారం చుట్టనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ఏడాదికి రూ.20 వేల కోట్లు మహిళా సంఘాలకు ఇస్తామని చెప్పామని, రెండున్నర ఏళ్లలోనే చెప్పిన విధంగా రూ.60 వేల కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. గతంలో మహిళా సంఘాలకు రూ.5 లక్షల వరకే వడ్డీ లేని రుణలు వచ్చేవని, ఇప్పడు రుణాలను రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని సూచించారు. మహిళా సంఘాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తోందని, ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామని భట్టి విక్రమార్క పునర్ఘటించారు.






