ఏ మంగా హే మంగా..
జయకృష్ణ ఘట్టమనేని ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ‘ఆర్‌ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వైలెంట్ రొమాంటిక్ డ్రామా ఇది. అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్‌పై జెమినీ కిరణ్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంతో రాషా తడాని తెలుగు తెరకు పరిచయం కానుంది. మోహన్‌బాబు, బ్రహ్మాజీ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ‘మంగా మంగా’ను విడుదల చేశారు. ‘ఏ మంగా హే మంగా దేవతవే ఖచ్చితంగా.. ఏ మంగా హే మంగా ఏ లోకం నుండి ఊడిపడ్డావే.. ఏ మంగా హే మంగా శ్రీనునే కరునించంగా.. ఈ ఏడుకొండలు చేరి ఉంటావే..’ అంటూ సాగుతోందీ గీతం. జీవీ ప్రకాశ్‌కుమార్ స్వరపర్చిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, ఎల్‌వీ రేవంత్ ఆలపించారు. ఈ చిత్రానికి జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రాఫర్‌గా, మాధవ్‌కుమార్ గుళ్లపల్లి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.






