రాజా ది రాజాతో మెప్పిస్తారు
యువత తమ కలల కోసం పరుగులు తీయడం, తల్లిదండ్రులు తమ ఆశయాలను పిల్లలపై రుద్దడం వంటి నేటి తరానికి అంశాలకు అందమైన ప్రేమ కథను మేళవిస్తూ తెరకెక్కుతున్న చిత్రం ‘రాజా ద రాజా’. అనిల్ బోయిడపు దర్శకత్వంలో వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కే నిహారిక దాసరి నిర్మిస్తున్నారు.
రుత్విక్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాలో విశాఖ ధీమాన్ కథానాయిక. సాయికుమార్, నరేశ్ వీకే, అవసరాల శ్రీనివాస్, విష్ణు ఓయి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకులు నాగ్‌అశ్విన్, హను రాఘవపూడి, వివేక్ ఆత్రేయ, నిర్మాత రవిశంకర్ పాల్గొన్నారు.
టీజర్ లాంచ్ చేసిన అనంతరం డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. “రిత్విక్ జర్నీని నేను దగ్గరగా చూశా. చాలా అంకితభావంతో పనిచేశాడు. నిహారిక ఈ సినిమాను చాలా గొప్పగా నిర్మించారు. ఇది వాళ్లకు ఆరంభం మాత్రమే. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్” అన్నారు. “నన్ను నటుడిగా గుర్తిస్తారని నమ్ముతున్నా. ‘రాజా ది రాజా’ జర్నీ చాలా మెమొరబుల్” అని హీరో రుత్విక్ తెలిపాడు. హీరోయిన్ విశాఖ ధీమన్ మాట్లాడుతూ.. “ఇది నాకు చాలా స్పెషల్ ఫిలిం.
తప్పకుండా ఈ సినిమాను అందరూ థియేటర్లలో ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా” అని తెలిపింది. ‘నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాత నిహారికకు, హీరో రిత్విక్‌కు చాలా థాంక్స్. ఈ సినిమాతో రిత్విక్ తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతారు’ అని డైరెక్టర్ అనిల్ చెప్పారు. ‘రిత్విక్ తప్పకుండా హీరోగా అందరినీ అలరిస్తాడ’ని నిర్మాత నిహారిక దాసరి తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో అతిథులు, నటీనటులు, సంగీత దర్శకుడు మార్క్ కే రాబిన్, చిత్రబృందం కూడా మాట్లాడారు.






