28 June, 2026 | 11:47 AM

ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా కొత్తగూడెం

28-06-2026 10:34 AM

* నూతన దేవాలయాలకు భూమి పూజ చేసిన గ్రామస్తులు

* గ్రామానికి నలుదిక్కుల రక్షణ కవచంగా గ్రామ దేవతల ఆలయాలు 

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని కొత్తగూడెం గ్రామంలో నూతన దేవాలయాలకు శనివారం కీతవారిగూడెం శివాలయ ప్రధాన అర్చకులు శ్రీరామయ్య శర్మ, భద్రయ్య శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల నడుమ శాస్త్రోప్తంగా భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామానికి నలుదిక్కుల రక్షణ కవచంగా ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగేలాగా ఆలయాలను నిర్మిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

గ్రామానికి రామాలయం, ముత్యాలమ్మ తల్లి ఆలయం, సత్యమ్మ తల్లి ఆలయం, కోట మైసమ్మ తల్లి ఆలయం, పెద్దమ్మ తల్లి ఆలయం, బొడ్రాయి ప్రతిష్టాపన యంత్ర తంత్రాలతో వేద పండితులు ఆధ్వర్యంలో త్వరలో నిర్మాణం చేస్తున్నట్లు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు తెలిపారు. నూతన రామాలయ దేవాలయ నిర్మాణంతో పాటు గ్రామానికి రక్షణ కవచంగా నిలిచే ఆలయాలను గ్రామానికి నలుమూలల గ్రామ దేవతల అనుగ్రహం కోసమే పలు ఆలయాలు నిర్మిస్తున్నట్టు గ్రామస్తుల సహాయ సహకారాలతో ఆలయాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు