28 June, 2026 | 12:32 PM

పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

28-06-2026 11:25 AM

హైదరాబాద్: ఆధునిక భారత నిర్మాణంలో చిరస్థాయిగా నిలిచే సేవలు అందించిన మాజీ ప్రధానమంత్రి, భారతరత్న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలకు నాంది పలికి, సంక్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించిన మహానేత అని కొనియాడారు. తెలంగాణ ముద్దు బిడ్డ, జాతి గర్వించదగిన మహానేత, బహుభాషా కోవిదుడు, గొప్ప మేధావి పీవీ నరసింహారావు సేవలు, ఆదర్శాలు భావితరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు.