పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ
28-06-2026 11:14 AM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డ, మన మాజీ ప్రధాని, భారతరత్న పి.వి. నరసింహారావుని వారి జయంతి సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పీవీ జ్ఞానభూమి వద్ద నివాళులర్పించారు. దూరదృష్టి కలిగిన వ్యక్తిగా, పండితుడిగా, అత్యుత్తమ పరిపాలనాదక్షుడిగా, మన దేశాభివృద్ధిలోనూ అలాగే హైదరాబాద్ విముక్తి పోరాటంలోనూ ఆయన అందించిన కృషి అద్వితీయమైనదని స్మరించుకుంటున్నారు.






