20 June, 2026 | 7:03 PM

Breaking News

ఫీజులు నియంత్రించకపోతే ఆందోళ తప్పదు   •   నామ భద్రయ్య మృతి పట్ల మాజీ ఎంపీ నామ, ఎంఎల్సీ తాతా మధుసూదన్ సంతాపం   •   మధిర కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్   •   సింగరేణి ఖాళీ క్వార్టర్ల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలి: ఏఐటీయూసీ   •   కొమరారం మండల ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనరసింహకు వినతి   •   యువత హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది   •   రైతులను నమ్మించి నట్టేట ముంచుతారా   •   కేరళ గ్లోబల్ హై స్కూల్‌లో ఘనంగా ముందస్తు యోగా దినోత్సవం   •   అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి   •   సీఆర్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •  

కనగర్తిలో ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్తులు

20-06-2026 05:57 PM

అతి వేగంగా వెళ్తున్నారని, నంబర్ లేని వాహనాలకు అనుమతులు ఇస్తున్నారని ఆరోపణలు

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని కనగర్తి గ్రామంలో ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలో ఇసుక ట్రాక్టర్లు అధిక వేగంతో సంచరిస్తుండటంతో ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులు, వృద్ధులకు ప్రమాదం పొంచి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో నుంచి వెళ్తున్న కొన్ని ట్రాక్టర్లకు రిజిస్ట్రేషన్ నంబర్లు లేకపోయినా అధికారులు అనుమతులు ఇస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు.

నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు లేని వాహనాలు ఇసుక రవాణా చేస్తున్నాయని, దీనిపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అతి వేగంతో ట్రాక్టర్లు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, గ్రామంలో వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరారు. నంబర్ లేని వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇసుక రవాణాను పూర్తిగా నిబంధనల ప్రకారం నిర్వహించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.