సమష్టి కృషితోనే గ్రామాభివృద్ధి
మహబూబాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): ప్రజలంతా సమిష్టి కృషితో గ్రామ అభివృద్ధికి బాటలు వేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకునేందుకు క లిసికట్టుగా ముందుకు నడవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పి లుపునిచ్చారు.
పచ్చదనం - పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, గంజాయి, మాదకద్రవ్యాలు , బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేయాలని, ప్రతి రైతు పంట మార్పిడి విధా నం వైపు మొగ్గు చూపాలని, సేంద్రియ ఎరువులు ప్రకృతి వ్యవసాయం చేయాలని, స్వయం సహాయక బృందాలు గ్రామస్థాయి ప్రతి విభాగంలో భాగస్వాములు కావాలన్నారు. జనగణన కార్యక్రమంలో ప్రతి ఒక్క రూ తమ వివరాలు నమోదు చేసుకోవాలని కలెక్టర్ ప్రజలను కోరారు.
గూడూరు మండ లం అప్పరాజుపల్లి, పొనుగోడులో గురువారం నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభల్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించి ప్రణాళిక రూపొందించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, తహసిల్దార్ నాగ భవానీ, ఏవో మాలిక్ పాల్గొన్నారు.






