5 June, 2026 | 2:52 PM

Breaking News

ప్రత్యేక గ్రామసభలతోనే ప్రజా సమస్యలకు పరిష్కారం

05-06-2026 01:43 AM

జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ 

మెదక్, జూన్ 4 (విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని శంకరంపేట ఆర్ మండలంలోని రుద్రారం గ్రామపంచాయతీలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ హాజరై గ్రామస్థులతో సమావేశమయ్యారు.

గ్రామ సర్పంచ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి , హార్టికల్చర్ అధికారి, ఇతర జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు.

గ్రామసభలో తాగునీటి నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (SIR-2026), పంటల మార్పిడి, బడిబాట కార్యక్రమం, ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసి, స్వచ్ఛత పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ గ్రామ సభలో గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు, వ్యవసాయ అధికారి దేవకుమార్, హార్టికల్చర్ అధికారి ప్రతాప్ సింగ్, సర్పంచ్ సంతోష నవీన్ గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.