7 August, 2026 | 8:19 PM

కూచనపల్లి–మాలపల్లి వంతెనకు నిధులు.. గ్రామస్తుల సంబరాలు

07-08-2026 07:15 PM

హుస్నాబాద్: కూచనపల్లి-మాలపల్లి గ్రామాల మధ్య వాగుపై వంతెన నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు కావడంతో శుక్రవారం హుస్నాబాద్ మండలం కూచనపల్లి గ్రామంలో గ్రామస్తులు మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను గత ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని గ్రామస్తులు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.