ఏజెన్సీలో నకిలీ నోట్ల చెలమని
* అమాయక గిరిజనులు మోసగిస్తున్న నకిలీ నోట్లు..
ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో 500 రూపాయల నకిలీ నోట్లు చలామణి అవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాల్లో నకిలీ నోట్లు చేరుకుంటున్నాయి. అమాయక గిరిజనులను ఆసరా చేసుకుని కొంతమంది నకిలీ నోట్లను అంటగడుతున్నారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గిరిజన కార్పొరేషన్ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకొని 500 రూపాయల నకిలీ అప్పగించారు.
పెట్రోల్ బంకులో వచ్చిన డబ్బులను పెట్రోల్ బంక్ నిర్వాహకుడు స్థానిక యూనియన్ బ్యాంకు లో బంకులు వచ్చిన డబ్బులను డిపాజిట్ చేసేందుకు వచ్చారు. వచ్చిన నోట్లలో 500 రూపాయల నకిలీ నోట్లు బ్యాంక్ అధికారుల గురించి ఇది ఫేక్ 500 రూపాయల నోటును తిరస్కరించడంతో నకిలీ నోటు వ్యవహారం బయటకు వచ్చింది. నకిలీ నోట్ల వ్యవహారం పై పోలీస్ శాఖ ప్రత్యేకంగా ఉంచి నకిలీ నోట్లను సరఫరా చేసే వారిని పట్టుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.






