3 May, 2026 | 4:03 AM

విజయ డెయిరీ పార్లర్ ప్రారంభం

03-05-2026 12:00 AM

బీఎన్ రెడ్డి నగర్ సచివాలయ నగర్ కాలనీలో ఏర్పాటు

హైదరాబాద్, మే 2(విజయక్రాంతి): బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ సచివాలయ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన మహిళా తీమ్ పార్క్ వద్ద ఇందిరా మహిళాశక్తి పథకం క్రింద ఏర్పాటు చేసిన తెలంగాణా విజయ డెయిరీ పార్లర్‌ను శనివారం తెలంగాణా రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కో ఆపరే టివ్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

కార్యక్రమంలో మల్కాజిగిరి మున్సిపల్ అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్, పీడీ యూ సీడీ సురేష్, బీఎన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మి ప్రసన్న రామ్మోహన్ గౌడ్, ఎల్‌బీ నగర్ యువ నాయకులు ముద్దగౌని మనీష్ గౌడ్, ప్రాజెక్ట్ ఆఫీసర్ విక్రాంత్ రెడ్డి, సీవో రాకేష్, వెంకటేష్ ఆర్‌పీఎస్, సచివాలయనగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పింగళి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి బాలిరెడ్డి, హౌసింగ్ సొసై టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు కూర్మారావు, మాజీ కౌన్సిలర్ ఉమాశ్రీనివాస్, కాలనీ ప్రతినిధులు ఆంజనేయులు, శ్రీధర్, గోపాల్ రెడ్డి, డెయిరీ పార్లర్ నిర్వాహకులు పద్మ, రమణ తదితరులున్నారు.