మోడీ పాలనలో దేశం అభివృద్ధి
ఖానాపూర్,(విజయక్రాంతి): దేశ ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనలో భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందని బిజెఎల్పి నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం కడెం మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో మోడీ 12 ఏళ్ల పాలనపై విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. దేశాన్ని 140 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ పాలన 12 ఏళ్ల బిజెపి పాలన ప్రజలు వేసుకున్నారని గుర్తు చేశారు.
దేశంలో దేశ రక్షణ పారదర్శకమైన పాలన ఉగ్రవాదంపై ఉక్కు పాదం 370 ఆర్టికల్ రద్దు అనేక కీలక అంశాలను ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు. అందుకే దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు మార్పు కోరుకుని బిజెపికి పట్టం కడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బిజెపి పార్టీలో కష్టపడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ ఎమ్మెల్యే రామారావు పటేల్. బిజెపి జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.






