13 June, 2026 | 7:50 PM

గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా రాథోడ్ ప్రకాష్

13-06-2026 06:38 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): రాష్ట్రంలోని  గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గిరిజన విద్యా విభాగం  గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం  రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా  రాథోడ్ ప్రకాష్ (ఇంద్రవెల్లి. అదిలాబాద్ జిల్లా) ఎంపికయ్యారు. రాష్ట్రంలోని అదిలాబాద్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం  తదితర జిల్లాలోని  గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు  శనివారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో ఎన్నికలు నిర్వహించారు.

ఈ ఎన్నికల అధికారులుగా  శ్రీరాములు, అశోక్ కుమార్లు వ్యవహరించగా, అదిలాబాద్ జిల్లా గిరిజన విద్యాశాఖ  ఉప విద్యాధికారి  గోడం చందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికలలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా  ఇరుప సారయ్య (వరంగల్),  రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా  ప్రేమ్ సింగ్  జాదవ్ (అదిలాబాద్), రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా  భద్రు నాయక్( భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) ఎన్నుకున్నట్లు  గెజిటెడ్ ఉద్యోగుల  సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు  ప్రకాష్ రాథోడ్ తెలిపారు. ఈ ఎన్నికలలో రాష్ట్రంలోని వివిధ ఐటిడిల పరిధిలోని  గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు  హాజరయ్యారని  ఆయన తెలిపారు.