కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ శానిటేషన్, పేషెంట్‌కేర్, సెక్యూరిటీ కార్మికులకు కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. బుధవారం కాగజ్‌నగర్ ఏరియా ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హర్షవర్ధన్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ కరోనా సమయంలో కీలక సేవలు అందించిన కాంట్రాక్ట్ కార్మికులకు ఇప్పటికీ తక్కువ వేతనాలే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.టెండర్ నిబంధనల ప్రకారం వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని, ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించడంతో పాటు బోనస్, సెలవులు, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నరేష్, మీనాక్షి, శారద తదితరులు పాల్గొన్నారు.






