మంత్రి కొండా సురేఖ ఫిర్యాదుపై కడియం రియాక్షన్
కొండా సురేఖను ఉద్దేశించి కడియం పరోక్షంగా వ్యాఖ్యలు
నేను ఏ తప్పు చేయలేదు.. వివరణ ఎందుకు ఇస్తా?
స్టేషన్ ఘన్‌పూర్: కడియం శ్రీహరి మంత్రి కొండా సురేఖను(Minister Konda Surekha) ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. తనపై కొండా సురేఖ చేసిన ఫిర్యాదుపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiyam Srihari) ఘాటుగా స్పందించారు. కొందరు కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారని, కాంట్రవర్సీ చేస్తూ.. ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నారని ఆరోపించారు. ''నేను ఏ తప్పు చేయలేదు.. వివరణ ఎందుకు ఇస్తా?, నేను సమీక్ష నిర్వహించలేదు.. సమస్యలు విన్నవించాను. నా వద్దకు అధికారులను పిలిస్తే అది సమీక్ష అవుతుంది. దేవాదాయశాఖపై సమీక్ష చేసే హక్కు లేదని నాకూ తెలుసు.'' అని పేర్కొన్నారు. ఆలయాల సమస్యల పరిష్కారానికి కమిషనర్ ను కలిశానని, తన నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధి కోసం చర్చించినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ సమస్యల కోసం అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానని కడియం శ్రీహరి తెలిపారు.






