8 July, 2026 | 3:19 PM

డీసీసీ అధ్యక్షులు దేవి లక్ష్మీప్రసన్నని కలిసిన పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

08-07-2026 02:07 PM

పినపాక ( విజయక్రాంతి): పినపాక మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన  పేరం వెంకటేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి అధ్యక్షురాలు   దేవి ప్రసన్న ని కొత్తగూడెంలోని డిసిసి  క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు పొందారు.

ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షురాలు దేవి ప్రసన్న  అతనికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించారు. పినపాక మండలంలో పార్టీ మరింత బలోపేతం కావడానికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తూ  శుభాభినందనలు తెలిపారు.

 ఈ కార్యక్రమంలో  డిసిసి ఉపాధ్యక్షులు గొడిశాల రామనాథం, జానంపేట సర్పంచ్ పూనెం ఉమామహేశ్వరి, ఉప సర్పంచ్ దాట్ల రాజేష్,   కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  తదితరులు పాల్గొన్నారు.