14 May, 2026 | 5:14 AM

సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు

14-05-2026 01:51 AM

బోనకల్, మే13 (విజయక్రాంతి): రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకొని శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సరిహద్దుల్లో పాలడుగు క్రాస్ రోడ్డు చెక్ పోస్టులో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు బోనకల్ ఎస్త్స్ర వెంకన్న తెలిపారు. ముఖ్యంగా  అక్రమ పశు రవాణాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా తక్షణమే పోలీసులకు తెలియజేయాలి తప్ప, ఏ పరిస్థితుల్లోనూ నిందితులపై ప్రత్యక్ష దాడులకు పాల్పడి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని స్పష్టం చేశారు.