14 July, 2026 | 7:43 PM

చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ

14-07-2026 07:10 PM

ముత్తారం,(విజయక్రాంతి): జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో, వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యక్తిగత పీఏ మహేంద్రనాథ్ యాదవ్ మంగళవారం పరామర్శించారు. సదానందం నివాసానికి వెళ్లిన మహేంద్రనాథ్ యాదవ్ మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, మంత్రి శ్రీధర్ బాబు తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. 

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి నాగినేని జగన్మోహన్ రావు, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు బియ్యాని శివకుమార్, ఏఎంసీ డైరెక్టర్ బుచ్చం రావు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు అల్లం కుమారస్వామి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బక్కతట్ల వినీత్, సర్పంచులు పేగుడ తిరుమల కుమార్, మెంగని సమత తిరుపతి, రాపెల్లి రాజయ్య, మండల సీనియర్ నాయకులు బక్కతట్ల కుమార్, సింగనవేన సమ్మయ్య, నునేటి కృష్ణ, గోవిందుల ఆనంద్, దుండె రాజేందర్, యూసఫ్ లాల్లుతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.