300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న కల్హేర్ పోలీసులు
14-07-2026 07:23 PM
కల్హేర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల పరిధిలోని మాసన్ పల్లి ధాబా వద్ద అక్రమంగా తరలిస్తున్న సుమారు 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కల్హేర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన తనిఖీల్లో ఈ బియ్యం పట్టుబడినట్లు ఎస్సై రవి గౌడ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి MH24AT7729 వాహనాన్ని స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి పట్టు బడిన వాహనాన్ని సివిల్ సప్లయ్ డీటీ శాజోద్దీన్ ను అప్పగించారు. ఎవరైనా రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రవి గౌడ్ హెచ్చరించారు.






