14 July, 2026 | 7:50 PM

వేంసూరు గ్రామంలో ఏఎంసీ చైర్మన్ శ్రీ దోమ ఆనంద్ బాబు జన్మదిన వేడుకలు

14-07-2026 07:28 PM

వేంసూర్,(విజయక్రాంతి): వేంసూరు వృద్ధుల శరణాలయంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి, వృద్ధులకు పండ్లు, ఆహార పదార్థాలు పంపిణీ చేసి వారి ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో వేంసూరు సర్పంచ్ ఎండి ఫకృద్దీన్ ఏఎంసీ  డైరెక్టర్ ఎండి అక్బర్  గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లెల్లి నరసింహాస్వామి ఉప సర్పంచ్ ఈడ ఏడుకొండలు పాల్గొని ఆనంద్ బాబు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇబ్రహీం  నవకుమార్  లాజర్  గురుప్రసాద్  నాగరాజు  తదితరులు హాజరై, ఆనంద్ బాబు  ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తున్న ఆనంద్ బాబు కి ప్రజల్లో విశేష ఆదరణ ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.