14 July, 2026 | 7:47 PM

క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ

14-07-2026 07:21 PM

నిత్య రాబడి-19,72,064/-

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య కైంకార్యాలను పండితులు ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో మంగళవారం క్షేత్ర పాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్ణు పుష్కరిణి ఆవరణలో గల ఆంజనేయస్వామికి అర్చక బృందం మన్యసూక్త పారాయణముతో అభిషేకంనిర్వహించారు. సింధూరంతో అలంకరించిన స్వామివారికి వివిధ రకాల సుగంధం వెదజల్లే ద్రవ్యాల పూలమాలలతో అలంకరించి నాగవల్లి దలార్చన నిర్వహించారు. ఈ ఆకు పూజలో భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొనియున్నారు. స్వామివారి నిత్య రాబడి 19,72,064/-వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.