17 August, 2026 | 7:44 PM

లీడ్ ఇండియా ఫౌండేషన్ సర్టిఫైడ్ ట్రైనర్ గా వీరవెల్లి శ్రీలత ఎంపిక

17-08-2026 06:48 PM

నేరేడుచర్ల, ఆగస్టు 17 (విజయక్రాంతి): లీడ్ ఇండియా ఫౌండేషన్ సర్టిఫైడ్ ట్రైనర్ గా నేరేడుచర్లకు చెందిన వీరవెల్లి శ్రీలత ఎంపికయ్యారు.లీడ్ ఇండియా ఫౌండేషన్ ముఖ్య ఆశయం 2047 విశ్వగురు భారత్, యువత లక్ష్యం కోసం కృషి చేయాలని, దేశ భవిష్యత్తు వారి మీద ఆధారపడి ఉందని యువతని మేల్కొల్పి మన సనాతన ధర్మాన్ని నేర్పిస్తూ కుటుంబ విలువలను మన దేశం పట్ల గౌరవాన్ని భక్తిని చాటుకునే విధంగా యువతను తయారు చేస్తే మన దేశం పూర్ణ వైభవం పొందుతుందని భారత మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాం యొక్క కల అని, దీనిలో భాగంగా త్యాగరాయ గాన సభలో ఏర్పాటు చేసిన సనాతన స్నాతకోత్సవంలో లీడ్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ ప్రొఫెసర్ సుదర్శన ఆచార్య చేతుల మీదుగా ట్రైనర్ వీరవెల్లి శ్రీలత సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు, తన వంతుగా లీడ్ ఇండియా ఆశయం కోసం పనిచేస్తానని ఎంతోమందిప్రముఖులుదీనిలో భాగంగా పని చేస్తున్నారన్నారు.ఈ కార్యక్రమoలో ప్రొఫెసర్ నరసింహారెడ్డి,రిటైర్డ్ ఐపీఎస్ బద్రీనాథ్, సంస్థ సభ్యులు కొండల్,రాకేష్ ,శృతి ,సంధ్యారాణి, అంజి రెడ్డి, మురళి, మహేష్ ,ప్రవీణ్, శైలజలు పాల్గొన్నారు.