17 August, 2026 | 8:48 PM

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి

17-08-2026 06:49 PM

లింగాపూర్, ఆగస్టు 17 (విజయక్రాంతి): బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించింది వేలాది నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిందని  బి ఆర్ ఎస్ నాయకులు పేర్కొన్నారు.

సోమవారం కొమురంభీం జిల్లా లింగాపూర్ మండల కేంద్రంలోని చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, వాటికి స్వస్తి పలికే విధంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ పథకాలను యథావిధిగా కొనసాగించి, పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఎలాంటి జాప్యం లేకుండా ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల నాయకులు లక్య నాయక్, గణపతి, మార్షకోలా జూగాదిరావ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.