17 August, 2026 | 8:47 PM

నీటి విడుదల కోసం రైతుల ధర్నా

17-08-2026 07:31 PM

ఇల్లంతకుంట 17 ఆగస్టు (విజయక్రాంతి): ఇల్లంతకుంట మండలంలోని వంతడుపుల బ్రిడ్జి పైనా సోమవారం రైతులు ధర్నా నిర్వహించారు, మద్యమానేరు జలాశయం నుండి కూడి కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలి అని ఆందోళన చేశారు. కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తే మండలంలోని వంతడుపుల, కందికట్కూరు, వల్లంపట్ల, గాలిపెల్లి, జవాహరిపేట గ్రామాల రైతుల పంటలు ఎండి పోకుండా ఉంటాయి అని రైతులు అన్నారు, ధర్నా ప్రాంతానికి చేరుకున్న తహశీల్దార్ సురేష్, ఎంపీడీఓ శశికళ రైతులతో మాట్లాడారు. ప్రజావాణిలో దరఖాస్తు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పడంతో రైతులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.