వాయిల్లపల్లి సంత వేలం
08-04-2026 01:14 AM
సమస్త నారాయణపూర్, ఏప్రిల్ 7 : మండలంలోని వాయిల్లపళ్లి గ్రామపంచాయతీ పరిధిలో ప్రతి శనివారం నిర్వహించే సంత వేలంపాట ఏప్రిల్ 09 గురువారం రోజున జరుగుతుందని పంచాయతీ కార్యదర్శి సువర్ణ ఒకప్రకటన ద్వారా తెలిపారు.
ఈ వేలం మండల పంచాయతీ అధికారి కే నరసింహారావు, సర్పంచ్ అయితరాజు సరళ చంద్రయ్య అధ్యక్షతన గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహిస్తారని వేలం పాటలో పాల్గొనేవారు ఇరవై ఐదు వేల రూపాయలు గ్రామపంచాయతీలో డిపాజిట్ గా చెల్లించాలని,డిపాజిట్ చెల్లించిన వారిని మాత్రమే వేలంపాటకు అనుమతిస్తామని తెలిపారు.




