30 July, 2026 | 8:08 PM

Breaking News

భారీ వర్షాలు, అప్రమత్తమే ప్రాణరక్షణ!   •   'స్నేహితుల దినోత్సవం' గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి   •   ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు   •   ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ నిర్ణయమే కీలకం: డిసిసి అధ్యక్షులు   •   వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   బాల కార్మికులను పనిలో పెట్టుకున్న అరుణ్ మహేష్ పై సస్పెక్ట్ షీట్ ఓపెన్   •   బదిలీపై వెళ్తున్న డిఎంకు ఘన సన్మానం   •   పీర్జాదిగూడలో ఆగస్టు 9న బోనాల ఉత్సవాలు   •   బొల్లారంలో పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి   •   93/2 సర్వే నెంబర్లు పాసుపుస్తకాలు ఇవ్వాలి   •  

వట్టె జానయ్యకు అస్వస్థత

06-06-2026 12:41 AM
  1. గాంధీ ఆస్పత్రికి తరలింపు
  2. టీఆర్పీ శ్రేణుల్లో ఆందోళన 

సూర్యాపేట, జూన్ 5 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సూర్యాపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద శుక్రవారం వజ్ర టౌన్ షిప్‌నకు సంబంధించిన వివాదం నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జానయ్యను అరెస్ట్ చేసి బల వంతంగా వాహనంలో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.

ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన జానయ్య.. అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. వెంటనే సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి కొంతమేర ఇబ్బందికరంగా ఉండటంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తర లించారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తున్నారు.