వర్ష పాశుపత వరుణ యాగం
21-07-2026 12:09 AM
యాదగిరిగుట్ట రామలింగేశ్వర ఆలయంలో నిర్వహణ
యాదగిరిగుట్ట, జూలై 20 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట దేవస్థానం అనుబంధ ఆలయమైన పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఎంతో భక్తిశ్రద్ధలతో వర్ష పాశుపాత వరుణ యాగం నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడి న వర్షాభావ పరిస్థితుల్లో తక్షణమే వర్షాలు కురవాలని దేవాదాయ ధర్మాదాయ శాఖమంత్రి కొండాసురేఖ ఆదేశాల మేరకు వరుణ యాగం నిర్వహించారు. సాయంత్రం గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం అఖండ దీపారాధన పంచగవ్యప్రాసనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, అధికారులు పాల్గొన్నారు.






