అవినీతిపైనా సైనికులు పోరాడాలి
సమాజంలోని అవినీతి, అన్యాయాలపై ప్రశ్నించాలి
బీజేపీ ఎక్స్ -సర్వీస్‌మెన్ సెల్ ప్రతినిధుల సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): సైన్యంలో ఉన్నప్పుడు దేశాన్ని కాపాడిన సైనికులు, రిటైర్‌మెంట్ త ర్వాత కూడా సమాజంలోని అవినీతి, అన్యాయాలపై పో రాడి దేశాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. సైనిక క్రమశిక్షణతో పనిచేస్తూ అందరూ కలిసికట్టుగా పనిచేసి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
బీజేపీ ఎక్స్ -సర్వీస్‌మెన్ సె ల్ ప్రతినిధుల సమావేశం సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. రాంచంర్‌రావు మాట్లాడుతూ.. గత 12 ఏళ్ల ప్రధాని పాలనలో రక్షణ రంగ ఎగుమతులు రూ. 38,400 కోట్లకు పెరగడంతో భారత్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించిందన్నారు. తెలంగాణలో తొలిసారిగా ఎక్స్ -సర్వీస్‌మెన్ సెల్ ప్రతి జి ల్లా నుంచి కన్వీనర్లతో బలమైన టీమ్‌లను ఏర్పాటు చేసుకుని, పార్టీలో అత్యంత క్రియాశీలక వింగ్‌గా రూపుదిద్దుకోవడం ఎంతో సంతోషకరమన్నారు.
జూలై 26న ’కార్గిల్ విజయ్ దివస్’ను రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించాలని సూచించారు. ’ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని రాంచందర్‌రావు స్పష్టం చేశారు. 2014లో రక్షణ బడ్జెట్ రూ. 2.5 లక్షల కోట్ల నుంచి రూ. 8 లక్షల కోట్లకు చేరిందన్నారు.
రక్షణ ఉత్పత్తుల విలువ రూ. 46వేల కోట్ల నుంచి రూ. 1.50 లక్షల కోట్లకు పెరిగిందని, ఆర్డినెన్స్ నిల్వల స్వయంసమృద్ధి 32 శాతం నుంచి 90 శాతానికి చేరుకుందన్నారు. నేవీ, కోస్ట్ గార్డ్ నౌకల్లో 97 శాతం మేడ్ ఇన్ ఇండియా ప రికరాలే ఉపయోగిస్తున్నామని, తేజాస్ యుద్ధ విమానాలు, ఐఎన్‌ఎస్ విక్రాంత్ వంటివి భారత రక్షణ సామర్థ్యానికి నిదర్శనమన్నారు. అనంతరం ఎక్స్‌సర్వీస్‌మెన్ సెల్ ప్రతినిధులకు ఆయన నియామక పత్రాలను అందజేశారు.






