22 July, 2026 | 1:45 AM

ఖజానా ఖాళీ..అభివృద్ధి గేలీ..!

22-07-2026 12:06 AM
  1. ఇదీ బల్దియా దుస్థితి 
  2. నిధులు లేక నిలిచిన అభివృద్ధి
  3. నిధులు కోసం నిరీక్షణ
  4. పెరగని ఆదాయం
  5. నిస్సహాయతలో పాలకులు

బెల్లంపల్లి, జూలై 21 : మంచిర్యాల జిల్లాలో సెకెండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా అత్యంత ప్రసిద్ధి గాంచిన పేరు బెల్లంపల్లి మున్సిపాలిటీకీ ఉంది. మంచిర్యాలకు సమ ఉజ్జి పట్టణ స్థాయి కలిగిన పారిశ్రామిక తొలిప్రాంతం.., అంత వరకు బాగానే ఉంది కానీ అభివృద్ధిలో మాత్రం ‘పేరు గొప్ప ఊరు దిబ్బ‘ చందంగా ఉంది. నిధుల లేమితో బెల్లంపల్లి బల్దియా ఖజానా ఖాళీగా ఉంది. నిధులు లేక పట్టణ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అనే చందంగా ఉందనీ స్థానికులు వాపోతున్నారు.

ఇటీవల జరిగిన ము నిసిపల్ ఎన్నికల్లో ఎన్నికైన, నూతనంగా కొ లువుదీరిన పాలక వర్గం నిధుల లేమితో ఏమి చేయలేకపోతున్నది. పట్టణంలో నిర్మా ణ అభివృద్ధి పనులు అంతగా లేవు. చేపట్టాలని పాలక వర్గ సభ్యులు వేసుకున్న ప్లాన్లు నిధులు లేక అమలుకు నోచుకోవడం లేదు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన చైర్ పర్సన్, కౌన్సిలర్లు ప్రజలకు ఎన్నో ఆకర్షణీయమైన హామీలు ఇచ్చి గెలిచారు. ఇప్పటి వరకూ ఎలాంటి ఫండ్స్ మంజూరు కాలేదు.

దీంతో ఆయా వార్డుల్లో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేకపోతున్నారు. గెలిచిన తరువాత వార్డుల్లో అభివృధి విషయంలో బోణి కొట్టలేకపోయామనీ ప్రతీ సభ్యుడు తెగ బాధపడిపోతున్నారు. చిన్న పనికూడా చేయలేని ఆర్థిక నిస్సహాయక స్థితిలో పాలక మండలి కొట్టుమిట్టాడుతున్నది. బల్దియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నది అధికార పార్టీ చైర్ పర్సన్. కాగా అభివృద్ది విషయంలో ఆమె పాత్ర సింహభాగంలో ఉండాలి. అలాంటిది నిధుల కొరత పెను శాపంగా మారింది.

పాలకులు మున్సిపాలిటీకి ఇప్పటి వరకూ ఎలాంటి ఫండ్స్ ను తీసుకురాలేక పోయా రు. ఈ విషయంలో పాలకమండలి ప్రధానంగా చైర్ పర్సన్ ఒకింత గిల్టీనెస్ గానే ఫీల వుతున్నారు. నిధుల కోసం ఇప్పటికే హైదరాబాదు కు వెళ్లి సిఎం రేవంత్ రెడ్డిని కలిశా రు. మంచిర్యాల జిల్లా పర్యటనకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కను నేరు గా కలసి మునిసిపాలిటికి నిధులు మంజూ రు చేయాలని అభ్యర్ధించారు. నిధుల కోసం విక్రమార్కునీలా అలుపెరుగని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

అయినప్పటికీ ఫలితం కా నరాలేదు. ఇప్పటికీ బెల్లంపల్లి బల్దియాకు ఒ క్క పైసా కూడా తీసుకురాలేకపోయారు. మున్సిపాలిటీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చే పట్టిన ప్రధాన రోడ్డు నిర్మాణ విస్తరణ పనులకు నిధులలేమి ప్రధాన శాపంగా మా రింది. నిధుల సపోర్టు లేక నిర్మాణ పనులు ఇంకా మొదలు కాలేదు. ఈ విషయంలో తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ అధికార పార్టీకి చెందినప్పటికీ నిధుల మంజూరులో ఆయన ప్రభావం ఆ శాజనకం గా కనిపించడం లేదన్న విమర్శలున్నాయి.

ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా బెల్లం పల్లికి ఒక్క పైసా కూడా రాలేదు. వస్తాయని ఆశకూడా లేదు. మంజూరుకు అతిగతి లే దు. పన్నుల రూపేణా బల్దియాకు ఏడాదికి సుమారు రూ. 2 కోట్లకు పైగా ఆదాయం చే రుతుంది. అవి కాస్త ఉద్యోగుల వేతనాలకు, ఇతర పరిపాలన అవసరాలకే సరిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నిధు లను అభివృద్ధి పనులకు వాడరాదు. ఆ స్థా యిలో నిధులు సమకూరడం లేదు. కనిష్ఠ స్థాయిలో వచ్చే ఈ నిధులను అభివృద్ధి పరమైన పనులకు ఉపకరించరాదు.

ఒక వేళ వినియోగించినా అవి ఎంత మాత్రం సరిపోవు. పట్టణంలో నూతనంగా భవంతులు, ఇండ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. వాటినుంచి వచ్చే అనుమతి బిల్లుల వసూ ళ్ళు కూడా సరిగా వసూళ్ళు చేయడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తం అవుతు న్నాయి. ఇండ్ల పర్మిషన్ ఫీజులు వేలాదిగా ఆదాయం సమకూరుతుంది. ఈ రకంగా వచ్చే ఆదాయంపై అధికారులు తగింత శ్రద్ధ పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

ఇళ్ళ నిర్మాణాలు జరుగుతున్నపుడు సంబంధిత అధికారులు ఇంటి కొలతలను విస్మరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్లక్ష్యం మునిసిపాలిటీకి చేతికివచ్చే ఆదాయానికి గండి కొడుతున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఇంటి బకాయిల ఎగవేత కోకొల్లలుగా ఉన్నాయని తెలుస్తోంది. ఆదాయం పెంచే మార్గాలను పట్టించుకోవడం లేదున్న విమర్శలు అధికారులపై బ లంగా ఉన్నాయి.

పన్నుల వసూళ్ళు అటుంచితే ఆదాయానికి అడ్డుపడుతున్న అధికా రులపై పుర పాలకులకు ఉదాసీనత పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా నిధుల లేమి బెల్లంపల్లి మునిసిపాలిటీని పట్టి పీడిస్తున్నది. బల్దియాలో నెలకొన్న నిధుల సంక్షోభం అభివృద్ధిని గేలి చేస్తున్నది. సమగ్రాభివృద్ది చేయాలనే తలంపుతో రాజకీయాల్లోకి వచ్చిన పురపాలక ప్రతినిధులు ప్రజల్లో తలెత్తుకు తిరగలేని దుస్థితి నెలకొంది. ఆయా వార్డుల్లో నిర్మాణ అభివృద్ధి సమస్యలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వస్తోన్న ఫిర్యాదులకు పురపాలక ప్రతినిధులు నుంచి సరయిన జవాబుదారితనం కనిపించడం లేదు. ప్రజల్ని నచ్చచెప్పే పరిస్థితిలో వారులేరు. ముఖం చాటేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధుల గౌరవం క్రమేణా బీటలు వారుతున్నది. ఈ ప్రతికూల ప్రత్యేక పరిస్థితులను అధిగమించడం ఎలా అన్నది ప్రజాప్రతినిధుల ముందున్న అతి పెద్ద సవాల్. ఎవరినీ వేడుకున్నా ఒక్క పైసా లేదు. ఈ సంక్షోభాన్ని అధిగమించడం ఎలా అని తలలు పట్టుకుంటున్నారు.