27 August, 2026 | 5:25 PM

మహబూబాబాద్‌లో ఘనంగా వనమహోత్సవం

27-08-2026 01:45 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ పట్టణంలోని గాంధీ పార్క్‌లో వనమహోత్సవ కార్యక్రమం(Vanamahotsavam) అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ ఎమ్మెల్యే(Mahabubabad MLA) డాక్టర్ మురళి నాయక్ హాజరై పార్క్ ప్రాంగణంలో స్వయంగా మొక్క నాటారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడంలో మొక్కల పాత్ర అత్యంత కీలకమని ఎమ్మెల్యే అన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి, సమృద్ధిగా వర్షాలు కురిసేందుకు ప్రతి ఒక్కరూ విస్తృతంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కనూ చెట్టుగా ఎదిగే వరకు సంరక్షించే బాధ్యతను పౌరులు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి రమేష్  మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.