27 August, 2026 | 10:22 PM

జనగామలో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో మహా ధర్నా

27-08-2026 01:49 PM

జనగామ, ((విజయక్రాంతి): టీఎన్జీవోస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలోని చౌరస్తా దగ్గర మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శి, వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.