27 August, 2026 | 9:54 PM

వన మహోత్సవ లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలి

27-08-2026 01:23 PM

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): వన మహోత్సవంలో జిల్లాకు కేటాయించిన మొక్కల నాటే లక్ష్యాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత సూచించారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణు మొక్కలు నాటారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలు, చెరువు గట్లు, రహదారుల వెంట మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో దత్తారావు, డీపీవో బిక్షపతి, అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.